పల్నాడు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ (ఏ.పి.ఎస్.పి.ఎఫ్)కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరోసారి సేవా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు అవసరంలో ఉన్న దైవసేవకునికి రూ.2,000 ఆర్థిక సహాయం అందజేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండల ఫెలోషిప్‌కు చెందిన దైవసేవకుడు, ఇనిమెట్ల గ్రామంలో పరిచర్య చేస్తున్న పాస్టర్ జి. సత్యరాజుకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. అవసరంలో ఉన్న దైవసేవకులకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సత్తెనపల్లి నియోజకవర్గ రీజనల్ ఇన్చార్జ్ రెవ. లివింగ్ స్టన్, రాజుపాలెం ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జి.ఎస్.ఆర్. రెడ్డి, స్థానిక కమిటీ సభ్యులు పాస్టర్ అబ్రహాము, పాస్టర్ కరుణ్ కుమార్, పాస్టర్ సంతోష్ బాబు, సత్తెనపల్లి ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు బ్రదర్ బెన్ స్టన్, అలాగే పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ మీడియా కమిటీ ఛైర్మన్ బ్రదర్ చంద్రన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఫెలోషిప్ సభ్యులు, ఆర్థిక సహాయం అందుకున్న పాస్టర్ జి. సత్యరాజు కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.








