పల్నాడు జిల్లా – మాచర్ల : విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) క్రీడా పోటీలు స్థానిక శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి క్రీడా ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. శివ కేశవ యాదవ్ (85 కిలోల విభాగంలో గోల్డ్ మెడలిస్ట్ వెయిట్‌లిఫ్టింగ్ కోచ్), పల్నాడు జిల్లా ఏజీఎం జానకి రామిరెడ్డి, ఆర్ అండ్ డీ హెడ్ మారియా, ఈ కిడ్స్ జెడ్ సీఈవో షేక్ రిహనీ, పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే శారీరక, మానసిక వికాసం మెరుగుపడటమే కాకుండా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు క్రీడల ద్వారా అలవడతాయని వారు పేర్కొన్నారు.
పోటీల్లో విద్యార్థులు రన్నింగ్ రేస్, డ్రాగ్ ది బాల్, రెడీ టు స్కూల్, ఆరెంజ్ పిక్, జిగ్‌జాగ్ రేస్ తదితర వినూత్న క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల ఉత్సాహం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి, స్కూల్ ఇన్చార్జిలు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, చంద్రిక, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రవి నాయక్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ ప్రీమియర్ లీగ్ ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన పోటీ తత్వాన్ని పెంచడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.









