contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైఎస్ భారతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

పల్నాడు జిల్లా – మాచర్ల : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్విట్టర్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై రాజకీయ చర్చలు జరిగినప్పటికీ, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయలేదని పిన్నెల్లి పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సూచనల మేరకు సంయమనంతో వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.

అయితే, జనసేనకు చెందిన కొందరు వ్యక్తులు ట్విట్టర్ స్పేస్‌లు, ఇతర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించి జగన్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించే కూటమి ప్రభుత్వం, వైఎస్ భారతిపై జరుగుతున్న వ్యాఖ్యల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్, బోయ రఘురామిరెడ్డి, పోలా శీను, పిల్లికొండ, మంద కృపారావుతో పాటు పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :