contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విలీన ప్రాంతాలను వెంటనే కార్పొరేషన్‌లో చేర్చాలి: పౌర సంక్షేమ సంఘం

కాకినాడ : గవర్నర్ ఆర్డినెన్స్ మేరకు తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, వాకలపూడి, వలసపాకల, రమణయ్యపేట గ్రామాలతో పాటు 42, 48 డివిజన్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా జీవో అమలు చేసి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.

ఆదివారం రాత్రి రమణయ్యపేట ఎఫ్‌సీఐ కాలనీలో నిర్వహించిన స్థానిక పౌర సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. సమావేశంలో మాట్లాడిన సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం తక్షణమే విలీన ప్రాంతాలను అధికారికంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.

దీంతో 2027–28 ఆర్థిక సంఘం నిధులు సుమారు 7 లక్షల జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్‌కు అందే అవకాశం ఉంటుందని, ఆ నిధులతో విలీన ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊతమిస్తాయని పేర్కొన్నారు.

అదేవిధంగా 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో వార్డు కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంతో పాటు జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

విలీన ప్రాంతాల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయించేందుకు పౌర సంక్షేమ సంఘం తరఫున తదుపరి కార్యాచరణను క్రియాశీలకంగా కొనసాగిస్తామని రమణరాజు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎ. అప్పలనాయుడు, మూర్తి, కిరణ్‌బాబు, వినయ్‌కుమార్, స్వామినాయుడు, భద్రరావు, హరికృష్ణ, రాజేష్, నాగరాజు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :