చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరోసారి సేవాభావం చాటుకున్నారు. జిల్లా అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్ నిర్ణయం మేరకు చిలకలూరిపేట నియోజకవర్గం, చిలకలూరిపేట మండలానికి చెందిన టి.సి.జి.యు.పి.ఎఫ్ (TCGUPF) సువార్తికురాలు ఎం. వసుమతి ఇటీవల ప్రభువునందు నిద్రించడంతో, ఆమె కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవుని సేవకుల కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్‌కు అనుబంధంగా ఉన్న పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సేవకుల కుటుంబాల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.
ఈ సహాయ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ రెవ. కె. జీవన్ పాల్, చిలకలూరిపేట నియోజకవర్గ రీజనల్ ఇన్‌చార్జ్ రెవ. డి. నెహెమ్యా, స్థానిక టి.సి.జి.యు.పి.ఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు రెవ. ఆషేరు, జిల్లా ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ బ్రదర్ టి. రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక ఫెలోషిప్ సభ్యులు, అలాగే ఆర్థిక సహాయం అందుకున్న దివంగత సువార్తికురాలు ఎం. వసుమతి కుటుంబ సభ్యులు పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిష్టర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అవసర సమయంలో అందించిన ఈ సహాయం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.







