contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక కాంగ్రెస్ యువజన రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథ్

బోయకొండ, పుంగనూరు : చిత్తూరు జిల్లా ప్రముఖ శక్తి క్షేత్రంగా పేరుగాంచిన బోయకొండ గంగమ్మ అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మంజునాథ్ సోమవారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు, ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను అందించి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మంజునాథ్ మాట్లాడుతూ, బోయకొండ గంగమ్మ అమ్మవారిపై కర్ణాటక రాష్ట్ర ప్రజలకు విశేష భక్తి ఉందని తెలిపారు. ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు కర్ణాటక నుంచి బోయకొండకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు.

కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా బోయకొండలో వసతి గృహాల నిర్మాణానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో కూడా చర్చిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ దయానన్, తెలుగుదేశం పార్టీ పుంగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణరాజు (పతిరాజు), స్థానిక నాయకులు రెడ్డి ప్రసాద్, కార్తీక్, మురళి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :