contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నూతన చేయూత పింఛన్ల పంపిణీ .. మంత్రి గడ్డం వివేక్‌కు ఘన స్వాగతం

మెదక్ జిల్లా – నర్సాపూర్ – తూప్రాన్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నర్సాపూర్ పట్టణంలోని సాయి కృష్ణ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాసాయిపేట, వెల్దుర్తి మండలాలతో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, లబ్ధిదారులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల కృతజ్ఞతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తమ మద్దతు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు మాట్లాడుతూ, నిజంగా అర్హులైన వారికి ఈసారి పింఛన్లు అందడం సంతోషకరమని పేర్కొన్నారు. తమకు ఎప్పుడైనా పింఛన్ వస్తుందనే ఆశ కూడా లేకపోయినా, ఇప్పుడు ప్రభుత్వం తమను గుర్తించి పింఛన్ మంజూరు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

అలాగే రాజకీయ భేదాలు లేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం అభినందనీయమని ప్రజలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు తిరిగి అందుబాటులోకి రావడం పేదలకు ఎంతో మేలు చేసిందని వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :