contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

గోదావరిఖని : విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన 154 మంది పోలీసు సిబ్బంది పేర్లను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్ చదివి వినిపించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, ఆర్‌జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్తో పాటు పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆర్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు శోకశస్త్రం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. వారి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి పోలీసు అధికారి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది సేవలు అభినందనీయమని, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ రవీందర్, ఏవో శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సీపీఓ సిబ్బంది, స్పెషల్ పార్టీ, ఏఆర్ సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :