contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిపిపి విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాకినాడ కార్పొరేషన్

కాకినాడ :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయం అభివృద్ది కోసం ప్రవేశ పెట్టిన పిపిపి పబ్లిక్ ప్రయివేటు పార్టనర్ షిప్ పద్ధతిని కాకినాడ నగర పాలక సంస్థ ఇష్టారాజ్యం చేసి పప్పు బెల్లాలకు దోచిపెడుతోందని విలువైన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని పౌర సంక్షేమం సంఘం పేర్కొంది. నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆస్తులు పార్కులు కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు నగర భవిష్యత్తు కోసం ప్రముఖులు ముందుకు రావాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు.

పిఠాపురం రోడ్డు లోని బోట్ క్లబ్ పార్కు వద్ద ప్లాట్ ఫారం ఆనుకుని పార్కు లోపలి ప్రాంగణంలో 600 నుండి 800 గజాల స్థలాన్ని నెలకు రూ. 8,100 వంతున ఏడాదికి 3% శాతం పెంపు చేసే విధంగా 12 నెలలకు రూ.97,200 లకు అద్దె ప్రాతిపదికగా పిపిపి పద్ధతిలో అంగడి టీ దుకాణ భవన నిర్మాణం కేటాయించడం విచిత్రంగా వుందన్నారు. ఇక్కడి ప్రాంతంలో బడ్డీ కొట్టుకు 10 వేల అద్దె వుండగా కోట్ల రూపాయల విలువ చేసే జిల్లా రహదారి మార్గంలో అతి చవకగా కట్టబెట్టడం వెనుక ఎవరి సైకిల్ చైన్ ప్రమేయంతో జరిగిందో నగర ప్రజలకుతెలియాలన్నారు. పిపిపి పద్ధతిలో అగ్రిమెంట్ ద్వారా స్థలం విలువ చేసే వ్యాపారం మేరకు బ్యాంకు రుణాలు పొందే అవకాశం వుందన్నారు. ప్రభుత్వ మున్సిపల్ స్థలాల్లో గతంలో చంద్రబాబు 1999-2004 లో ప్రభుత్వం ఇచ్చిన జీ ఓ ప్రకారం చిరు వ్యాపారులకు గుడ్ విల్ ఆక్షన్ పద్ధతిలో జనతా దుకాణాల నిర్మాణం లేకుండా కార్పోరేట్ వ్యాపారం చేయడం ద్వారా దళారులతో అధికారులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కవుతున్నారన్నారు.

సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం పార్కులు చెరువులు పాఠశాలల ప్రదేశాల్లో ఇతర నిర్మాణాలు చేయరాదన్న ఉత్తర్వులు వుండగా వాటికి విలువ ఇవ్వకుండా కార్పొరేషన్ వ్యవహరించిన తీరు అతి నీచం గా వుందన్నారు. జీవో నంబర్ G.O.Ms.No. 72,20 ఫిబ్రవరి 2002 ప్రకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఉద్దేశ్యం గా సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం, ఏపీలోని అన్ని మున్సిపాలిటీలు మరియు లేఅవుట్లలో పార్కులు, ఆటస్థలాల కోసం కేటాయించిన ఓపెన్ స్పేస్ ల్యాండ్‌ను ఇతర ఏ అవసరాలకూ మళ్లించకూడద న్న ప్రభుత్వ జీవోను ఉల్లంఘించడం క్షమార్హం కాదన్నారు.

ఇదే రీతిలో ప్రజలకు మీడియాకు తెలియకుండా పిపిపి పద్ధతిలో జరిగిన అన్యాక్రాంత దృష్టాంతాలు మరిన్ని వున్నాయని వాటిని చట్టం ప్రకారం బహిరంగం చేయాల్సిన అవసరం వుందన్నారు. లేని పక్షంలో సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించి వాటిల్లో కార్పొరేషన్ ఆస్తులకు- అభివృద్దికి- ఆదాయానికి నష్టం వుంటే ప్రజాహితం కోసం ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలు న్యాయస్థాన ముందు బహిరంగం చేస్తామన్నారు.

బోటుక్లబ్ లో ఉద్యానవన ఏర్పాటు తప్ప ఇతర నిర్మాణాలకు అనుమతించడం కూడదని ప్రభుత్వం స్పందించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆస్తులు ఎక్కడ వున్నా మార్కెట్ రేట్ కు అనుగుణంగా మరింత ధర వచ్చే గుడ్ విల్ ఆక్షన్ పద్ధతిలో పిపిపి వుండాలి తప్ప పప్పు బెల్లాలకు విలువైన స్థలాలు ధరాదత్తం చేసే అధికారం లేదని రమణ రాజు పేర్కొన్నారు.

నగరంలో పిపిపి పద్ధతిలో కేటాయించిన అన్ని రకాల చర్యలు పారదర్శకత జవాబు దారీతనం కోసం మీడియా ముందు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :