కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు ఆదివారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మెన్ మాతంగి శిరీష అనిల్, వైస్ చైర్మెన్ పర్ష సంతోష్ తోపాటు డైరెక్టర్లు జిల్లా రాజేశ్వరి, దేశరాజు అనిల్, నందికొండ తిరుపతిరెడ్డి, మైసంపల్లి తిరుపతి, ఇస్కిల్ల ఐలయ్య, జీల లింగం, రెడ్డి రామకృష్ణారెడ్డి, మహమ్మద్ సాదిక్, కుంట హరికృష్ణ, ఎలకంటి శ్రీనివాస్ రెడ్డి, బోయినపల్లి కృష్ణారావు, గుండా వెంకట్ రెడ్డిలనుఎమ్మెల్యే సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, బెజ్జంకి పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్,పార్టీ నాయకులు ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








