contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో కూటమి విజయానికి .. యాగంటి ప్రచారం

మాచర్ల, పల్నాడు జిల్లా: మాచర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న నేపథ్యంలో 19వ వార్డులో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా చేసుకుని మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఏనుమల సుష్మా రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండ్ల అనురాధలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వార్డు ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, వాటి కొనసాగింపుకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

మాచర్ల పట్టణ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి కృషి చేస్తున్నారని, పట్టణానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఆ అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలపాలంటే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ఈ ఎన్నికల ప్రచారంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండ్ల అనురాధ, బూత్ ఇన్‌చార్జి బండ్ల బ్రహ్మం, బండ్ల శ్రీనివాసరావు, మాజీ వార్డు కౌన్సిలర్ చందు, బృంగా రమణ, బృంగా బాబు, దుబ్బాకల ప్రసాద్, బొట్టు కోటేశ్వరావు, బొట్లగుంట ఆంజనేయులు, దొండపాడు సీతారామయ్య, కామినేని ఆంజనేయులు, కోలే సురేష్, రాయపాటి శ్రీనుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :