contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన కార్పొరేటర్ .. అధికారులకు వినతి

గోదావరిఖని : రిపోర్టర్ టీవీలో ప్రసారమైన కథనానికి స్పందించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్, సింగరేణి సెక్టార్–2లోని కమ్యూనిటీ హాల్‌ను మరమ్మతులు చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) వసంత కుమార్‌లను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ వినతిపత్రాన్ని అందజేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక కుటుంబాలు అధికంగా నివసించే 43వ డివిజన్‌లోని సెక్టార్–2 కమ్యూనిటీ హాల్ చాలా కాలంగా నిరుపయోగంగా మారిందన్నారు. సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడ యువకులు మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ హాల్‌కు అవసరమైన మరమ్మతులు చేపట్టి, ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, డిప్యూటీ జీఎం (సివిల్) వసంత కుమార్ సమస్యను సానుకూలంగా పరిశీలించి, త్వరలోనే అవసరమైన మరమ్మతులు చేపట్టి కమ్యూనిటీ హాల్‌ను ప్రజల వినియోగానికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ వెల్లడించారు.

ప్రజా సమస్యను పరిష్కరించే దిశగా సహకరించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, డిప్యూటీ జీఎం వసంత కుమార్‌తో పాటు సింగరేణి అధికారులకు 43వ డివిజన్ ప్రజల తరఫున కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్ టీవీలో వెలుగులోకి వచ్చిన సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, కమ్యూనిటీ హాల్‌ను త్వరితగతిన అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :