contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మాజీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్ రావు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేట, మాదాపూర్, పారువేల్ల గ్రామాలలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బ తిన్న మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పెసర చేనును మాజి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సని సుగుణకర్ రావు.పరిశీలించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు మక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలు చాలా నష్టనికి గురి అయ్యాయి. మక్కా ఇప్పుడే కంకి పొసే సమయం లో వడగండ్లకు పంట అంత కింద పడిపోవడంతో రైతులు ఎకరానికి 30,000 రూపాయల పెట్టుబడి నష్టపోయారు. అలాగే పొద్దు తిరుగుడు కూడా ఎకరానికి 25,000 వేలకు పై చిలుకు నష్టపోయారు అని అన్నారు. ఈ విషయం పై పోల్సని సుగుణకర్ రావు అధికారులతో మాట్లాడడం జరిగింది.తెలంగాణ రాష్ట్రంలో పంటల భీమా పథకం అమలు లో లేని కారణంగా పంటల నష్ట పరిహారం పొందడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫసల్ భీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయమంటే చేయకుండా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ కూడా 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు ఇస్తుంది. గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలలు కూడా లేవు. రాష్ట్రం అంత కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లో లేదు. ఈ ప్రభుత్వం రైతులను విస్మరిస్తుందని ఒక చేతితో పది రూపాయలు పెట్టి మరో చేతితో ఇరవై రూపాయలు వసూలు చేస్తుంది అని అన్నారు. ఇటువంటి పంట నష్టం జరిగినప్పుడు రైతు ఎకరానికి ముప్పై వేల రూపాయలు నష్టపోతున్నాడు. మీరు రైతు బంధు పథకం ద్వారా ఇచ్చేది 5వేల రూపాయలు మాత్రమే ఇంకా రైతు 25వేలు అదనంగా నష్ట పోతుండు. ప్రకృతి వైపరీత్యాల మూలంగా ఇటువంటి వడగాళ్లు, కరువు, అధిక వర్షాలు, తెగుళ్ళు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి పంట ఎంత నష్టపోతే అంత పరిణామంలో నష్ట పరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేసారు. రైతు బంధవుడు అని చెప్పుకుంటున్న కెసిఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడం లో కెసిఆర్ ప్రభుత్వం వైపళ్యం చెందింది అని మరియు కెసిఆర్ మాటలు మాత్రం గొప్పగా ఉన్నాయి కానీ అమలులో మాత్రం శూన్యం అని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూపాయలు 40వేల చొప్పున రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బండి తిరుపతి, గడ్డం సుమిత్ రెడ్డి, బుర్ర రమేష్ గౌడ్, నూనె శ్రీనివాస్ రెడ్డి, కూన లక్ష్మన్, మండల సోషల్ మీడియా కన్వీనర్ మచ్చ మురళీకృష్ణ, బోయిని లక్ష్మన్, ప్రవీణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :