తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల విషయంలో ఆ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో అధ్యక్షులను మార్చనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్, తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సాయంత్రం హైకమాండ్ ప్రకటన చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక కిషన్‌రెడ్డికి గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఆయన పని చేస్తున్నారు. బండి సంజయ్ స్థానంలో స్టేట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.