కరీంనగర్ జిల్లా: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హై కోర్ట్ తిరస్కరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ టిపిసిసి ఆదేశాల మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామం స్టేజ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది.