అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ చీడివలస కొండ శిఖర గ్రామం కోదు ఆదివాసి గిరి 22 కుటుంబాలు 120 మంది జనాభా కలిగిన గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు తెల్లవారుజాము ఉదయం4 పురిటి నొప్పులు రావడంతో. ఉదయం 6 గంటలకు 108 ఫోన్ చేయగా ఉదయం ఎనిమిది గంటలకి గ్రామానికి కిలోమీటర్ దూరం వరకు అంబులెన్స్ వచ్చింది రోడ్డు సౌకర్యం లేదని గర్భిణీ స్త్రీ కిల్లో వసంత (28)w/0 భాస్కరరావు మూడో కాన్పు గ్రామం నుండి అంబులెన్స్ కు తీసుకెళ్తున్న మార్గ మధ్యలో ఆడబిడ్డ జన్మించింది.
అధిక రక్త ప్రసన్న జరగడంతో 108 సిబ్బంది వచ్చి కొంత వైద్య సహాయం చేసి. అంబులెన్స్ వరకు తీసుకువెళ్లారు. అక్కడనుండి హుకుంపేట మండలం ఉప్ప ప్రాథమిక హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా.. ఉపాధి పథకం ద్వారా మిషన్ కనెక్ట్ ప్రోగ్రాంలో కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పట్టినట్టు రికార్డు చూపిస్తున్నారు. వాస్తవానికి గ్రామాలకు వచ్చేసరికి ప్రోక్లైన్ తో హెడ్ వర్క్ చేస్తున్నారు. బిల్లులు మార్చుకొని తినేస్తున్నారు… అడిగే వారే లేరు…
తక్షణమే ఇటువంటి వాటిపై ఐటీడీఏ పీఓ రోడ్లు వేసి మార్గం మధ్యలో వదిలేసినటువంటి రోడ్డుని వెంటనే పూర్తి చేయాలని గ్రామ మాజీ ఉప సర్పంచ్ కిలో నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు డిమాండ్ చేశారు.