- మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి వినతి పత్రం
- ఎస్సీ నిధులను వెంటనే విడుదల చేయాలి
- భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం తాసిల్దార్ జ్ఞాన జ్యోతి కి ఎస్సీ మోర్చా ఆకారం బాబు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ మాదిగ కి రావలసిన నిధులను విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఆకారం బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్డ్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునః నిర్మాణం తదితర అంశాలకు రాష్ట్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని బాధాకరమని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయాలని, ఎస్సీ ఉప కులాలు, మాల , మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి రూ. 750 కోట్లు కేటాయించాలని, ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇళ్లు నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్ధిక సహాయం అందజేయాలని, ఎస్సీ హాస్టల్స్ పునః నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలకు సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించాలి డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, కిసాన్ మోర్చా నాగేందర్ రెడ్డి, వేణుగోపాల్, గుడ్డి కృష్ణ మాదిగ, రాములు తదితరులు పాల్గొన్నారు.