తాడేపల్లి : వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.
ఆ మహిళ స్వస్థలం విజయవాడ. ఇవాళ ఆమె తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజును కలిసి మేరుగు నాగార్జునపై ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వాలని అడిగితే బెదిరించారని వెల్లడించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.