contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘ఓట్ బచావో – దేశ్ బచావో – సంవిధాన్ రక్షక్ మార్చ్’ ను విజయవంతం చేయాలి

మెదక్ జిల్లా – నర్సాపూర్/తూప్రాన్ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “ఓట్ బచావో – దేశ్ బచావో – సంవిధాన్ రక్షక్ మార్చ్” ను విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఇప్పటికే నమోదైన ఓటర్ల హక్కులను పరిరక్షించడం ఎన్నికల వ్యవస్థ బాధ్యత అని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగాలని, అర్హులైన ఒక్క ఓటరికి కూడా అన్యాయం జరగకుండా భారత ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటు హక్కు పరిరక్షణ, రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఈ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు ట్యాంక్‌బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బ్లాక్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆంజనేయులు గౌడ్ విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :