కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో శుక్రవారం అమెరికా దేశస్తులు పర్యటించారు. అమెరికాలో స్థిరపడ్డ ద్వారంపూడి రాజీవ్ రతన్ రెడ్డి తన యొక్క అమ్మమ్మ ఊరు అయినా గన్నేరువరంకు అమెరికా కు చెందిన కెవిన్ హెలెన్ హాలి కార్లీ అనే నలుగురు మిత్రులను తీసుకొని రావడం జరిగింది, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్మోహన్, మండల అధ్యక్షుడు పుల్లెల రాము వారికి స్వాగతం పలికి, పూల మాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి అనంతరం గన్నేరువరంలోని పంట పొలాలను వ్యవసాయ బావులను పండ్ల తోటలను డైరీ ఫారంను వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఊర చెరువును మరియు ఎల్ఎండి బ్యాక్ వాటర్ అందాలను చూపించడం జరిగింది, అలాగే గంగిరెద్దు మరియు మేక పిల్లతో ఫోటోలు దిగి పల్లెటూరు జీవన విధానాన్ని అడిగి తెలుసుకొని పల్లెటూరి వాతావరణం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేసారు. గ్రామంలో కొంతమంది కి ఆర్థిక సహాయం చేసి పలువురు గ్రామస్థులతో అమెరికా వాసులు ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి శారద భిక్షు పాపయ్య రాజేంద్రచారి పాల్గొన్నారు.