contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్షయ్ కుమార్‌పై నెటిజ‌న్ల మండిపాటు

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్ కొత్త సినిమా బచ్చన్‌ పాండే ఈ నెల‌ 18న విడుదలై విమ‌ర్శకుల ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే, ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ హింసాత్మక నేరస్థుడిగా క‌న‌ప‌డ‌డం, ఆయ‌న ప్ర‌జ‌ల‌ను హ‌త్య‌లు చేయ‌డం వంటి సీన్లు ఉన్నాయి. ఇటువంటి సినిమాకు పాండే వంటి గొప్ప‌ యోధుడి పేరును వాడ‌డం ప‌ట్ల నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. #BoycottBachchhanpandey హ్యాష్‌ట్యాగ్ పేరిట పోస్టులు చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

హిందువులను కించపరిచే విధంగా అక్ష‌య్ కుమార్‌ పాత్రను చిత్రీకరించారని కొంద‌రు అంటున్నారు. కాగా, తమిళ సినిమా ‘జిగర్తాండా’కు రీమేక్ గా తెలుగులో ‘గద్దలకొండ గణేశ్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే హిందీలో బచ్చన్‌ పాండేగా రూపొందించారు. ఇందులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్, కృతి సనన్‌, అర్షద్‌ వార్సీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :