contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గుత్తిలో జనసేన జోరు… రెండో, నాలుగో వార్డుల్లో ఇంటింటా ప్రచారం

  • ప్రజల నుంచి విశేష స్పందన … గెలుపే లక్ష్యంగా జనసేన శ్రేణుల ముందడుగు
  • కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి – సంక్షేమం సాధ్యం : గుంతకల్ నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వాసగిరి మణికంఠ

అనంతపురం జిల్లా, గుత్తి: గుత్తి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. జనసేన పార్టీ రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గద్దల కార్తీక్, నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మందగంటి తులసిరామ్ తరఫున గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ (POC) వాసగిరి మణికంఠ, గుత్తి పట్టణ అధ్యక్షుడు పాటిల్ సురేష్ ఆధ్వర్యంలో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా స్థానికులను కలిసి జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రజాసేవకు అంకితమైన యువ జనసైనికులకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. గుత్తి అభివృద్ధికి కూటమి ప్రభుత్వంతోనే వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన వందల కోట్ల రూపాయల నిధులను అప్పటి మున్సిపల్ పాలకవర్గం సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయిందని ఆయన విమర్శించారు. ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గుత్తి పట్టణ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తాగునీటి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపడంతో పాటు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వీరమహిళలు, జనసైనికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తుందనే ఆశాభావాన్ని నాయకులు వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :