పల్నాడు జిల్లా, మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రామ తులసి ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. బీరువా గుర్తుపై తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని ఆమె వార్డు ప్రజలను కోరారు.
ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. వినాయకుడి గుట్ట, ఆజాద్ నగర్, ఇందిరమ్మ కాలనీ, వైఎస్సార్ కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి బీరువా గుర్తును గుర్తుచేస్తూ తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా రామ తులసి మాట్లాడుతూ, 36వ వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. వార్డు సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రచారంలో బొంగురు, గెల్లిపోగు సామేలు, షేక్ ఖాసిం, పోలేపల్లి ఆనంద్, దాసు, పరిమళ సాయి, బాలయ్య, అబ్బాస్, నాగమణితో పాటు ముస్లిం మైనార్టీ మహిళలు, దళిత మహిళలు సహా వంద మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. అలాగే పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొని రామ తులసికి మద్దతుగా ప్రజలను కోరారు.
వార్డు ప్రజలు కూడా ప్రచారానికి సానుకూలంగా స్పందిస్తూ తమ సమస్యలను అభ్యర్థి దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రామ తులసి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో బీరువా గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె మరోసారి విజ్ఞప్తి చేశారు.








