గోదావరిఖని : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. రక్తదానం అనేది సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే రక్తం ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జైపూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో ఎస్సై భూమేష్, పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
ఆరోగ్యపరంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకుని, అవసరమైన సందర్భాల్లో స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీపీ పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేష్, ప్రజాప్రతినిధులు, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








