contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకాల మండలంలో వైసిపి అభ్యర్థుల విజయమే లక్ష్యం

పాకాల, తిరుపతి జిల్లా : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు.

పాకాల మండలం దామలచెరువులో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల ప్రచారం, పార్టీ కేడర్ సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు. పాకాల మండల జడ్పీటీసీ అభ్యర్థి శ్రీలేఖ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పాకాల మండలంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు. ఎన్నికలు జరగని ఎంపీటీసీ స్థానాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోయేలా టీడీపీ అనైతిక చర్యలకు పాల్పడిందనే విషయాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగకపోవడానికి టీడీపీ భయమే కారణమని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు ప్రాధాన్యతపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికలు జరగని గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచి వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచేలా కృషి చేయాలని కోరారు.

కే. వడ్డేపల్లి, ఉప్పరపల్లి గ్రామ పంచాయతీల పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించుకుని పార్టీ బలాన్ని చాటాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోరారు. అలాగే పాకాల మండల జడ్పీటీసీ అభ్యర్థి శ్రీలేఖ విజయమే లక్ష్యంగా అన్ని గ్రామ పంచాయతీల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

పార్టీలోని అంతర్గత విభేదాలను పక్కనపెట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :