contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందన .. కమ్యూనిటీ హాల్‌ కొత్త కళాకాంతులు

గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్‌లో ఉన్న సింగరేణి కమ్యూనిటీ హాల్ దయనీయ పరిస్థితిపై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. సమస్యను పరిశీలించిన సింగరేణి అధికారులు కమ్యూనిటీ హాల్‌లో ఫ్యాన్లు, లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇటీవల కమ్యూనిటీ హాల్‌లో విద్యుత్, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రిపోర్టర్ టీవీ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. కథనం ప్రసారమైన వెంటనే అధికారులు స్పందించి సంబంధిత పనులు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో నివసిస్తున్న ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ హాల్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. హాల్‌లో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, తగిన కుర్చీలు, నిర్వహణ పనులు, ఇతర మౌలిక వసతులు కల్పించి ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని వారు కోరుతున్నారు.

ప్రజా సమస్యలను బాధ్యతాయుతంగా వెలుగులోకి తీసుకొచ్చిన రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించి తక్షణ చర్యలు చేపట్టిన సింగరేణి అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి కమ్యూనిటీ హాల్‌ను ఆదర్శవంతమైన ప్రజా వేదికగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :