పల్నాడు జిల్లా – వెల్దుర్తి : వెల్దుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ)గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి మూడవత్ వజ్రం శారదా నాయక్ కి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శారదా నాయక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించిన యాగంటి మల్లికార్జున రావు, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆమె ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధత మరింత మందికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు. వెల్దుర్తి మండల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి గ్రామానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని శారదా నాయక్‌కు సూచించారు.
అలాగే రాజకీయ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించిన ఆయన, ప్రజాసేవలో ఆమె ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధిలో శారదా నాయక్ పేరు చిరస్థాయిగా నిలిచేలా సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొని నూతన ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. వెల్దుర్తి మండల సమగ్ర అభివృద్ధికి ఆమె నాయకత్వం దోహదపడుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.








