contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

పాకాల, తిరుపతి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం పాకాల మండలంలోని సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు.

పాకాల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు, ఎస్‌ఐలు తరుణ్, నాగ మంజుల, గోపాల్ నాయక్, ఎంపీడీవో వాసుదేవరావు, డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వినోద్‌తో పాటు పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల లభ్యతను అధికారులు తనిఖీ చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, పోలింగ్ కేంద్రాలకు చేరుకునే మార్గాలు, పరిసర ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు.

ఎన్నికల నియమావళిని పాటించాలి: సీఐ చిన్న గోవిందు

ఈ సందర్భంగా సీఐ టి. చిన్న గోవిందు మాట్లాడుతూ, పాకాల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ పోలీస్, రెవెన్యూ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని అధికారులు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :