కరీంనగర్ జిల్లా: గన్నేరువరం నుంచి కరీంనగర్ వరకు లోయర్ మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎంపి బండి సంజయ్ ని గురువారం బ్రిడ్జి నిర్మాణ పోరాట సమితి చైర్మన్ సంపతి ఉదయ్ కలసి వినతి పత్రం అందజేశారు. బండి సంజయ్ సానుకూలంగా స్పందించారని, బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడం జరిగిందనీ ఉదయ్ తెలిపారు, లారెల్ స్కూల్ వెనకాల నుండి స్మశాన వాటిక నుండి యాస్వాడ మైసమ్మ గుట్ట వరకు కిలో వీటర్నరా బ్రిడ్జి నిర్మించాలని కోరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఇస్తే నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.బ్రిడ్జి నిర్మాణంతో మూడు మండలాల ప్రజలు 87 గ్రామాలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, సొల్లు అజయ్ వర్మ, డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, కరివేద మైపాల్ రెడ్డి పాల్గొనడం జరిగింది.









