contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

గోదావరిఖని : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇంద్రానగర్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ ఆధ్వర్యంలో వల్స సుజాత నివాసంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె కాలనీ మహిళలతో కలిసి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలతో మమేకమై పండుగ సంబరాలను పంచుకున్నారు.

మహిళల ఐక్యతకు ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళల ఐక్యత, ఆత్మీయతకు ఈ వేడుకలు నిదర్శనమని అన్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేస్తూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం కాలనీలో పండుగ వాతావరణాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో విజయ, తిరుమల, కనకలక్ష్మి, లచ్చమ్మ, కళావతి, మహేశ్వరి, శ్యామల, పద్మ, సాయిప్రియ, సరిత, కవిత, పావని, శ్వేత, భాగ్య, సంజన, రమ్య, శారద, శాన్వి, యశస్విని, శాన్విక తదితర మహిళలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :