contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

RFCL కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. యూనియన్ వినతి

గోదావరిఖని : RFCL కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు, ప్లాంట్ రింగ్‌రోడ్డు సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్కును అభివృద్ధి చేయాలని కోరుతూ అలైడ్ వర్కర్స్ యూనియన్ నాయకులు RFCL యాజమాన్యానికి వినతిపత్రం అందజేశారు.

రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచనల మేరకు, RAWU అధ్యక్షుడు, కార్పొరేటర్ నేలకంటి రాము ఆదేశాలతో అలైడ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు వడ్లకొండ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు RFCL ఏజీఎం మగేశ్వరన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

అమరవీరుల స్థూపం వద్ద పార్కు అభివృద్ధికి విజ్ఞప్తి

RFCL ప్లాంట్ రింగ్‌రోడ్డు సమీపంలో 1990లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని యూనియన్ నాయకులు కోరారు. అక్కడ పార్కును ఏర్పాటు చేసి మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంపొందించడం, అలంకరణ లైట్లు ఏర్పాటు చేయడం, నడక దారులు నిర్మించడం, సందర్శకుల కోసం బెంచీలు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దడం ద్వారా అమరవీరుల స్మృతిని గౌరవించడంతో పాటు ప్రజలకు ఉపయోగకరమైన పార్కు అందుబాటులోకి వస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

RFCLలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు గతంలో యాజమాన్యానికి సమర్పించిన డిమాండ్లపై కూడా యూనియన్ నాయకులు చర్చించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

యాజమాన్యం తమ వినతిపై సానుకూలంగా స్పందించిందని వడ్లకొండ మహేందర్ గౌడ్ తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద పార్కు అభివృద్ధి ప్రతిపాదనను పరిశీలించడంతో పాటు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏజీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :