కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు సైన్స్ డే సందర్భంగా పలు రకాల ప్రదర్శనలు ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ప్రదర్శన లు పాఠశాలలు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రతి ఒక్కరు దాగి ఉంటుందని నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు రాబోయే తరానికి కాబోయే శాస్త్రవేత్తలుగా ఎదగాలని కరస్పాండెంట్ బూర వెంకటేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాను చైతన్య,సంతోష్ కుమార్, నామ్ దేవ్, లత, మమత, శ్వేత,శిరీష, వర్షిత,సరిత విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.