గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం గ్రామ సర్పంచ్ రంగనవేణి లచ్చినర్సు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన, ఆదివారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తిమ్మాపూర్ (ఎల్‌ఎండీ)లోని ప్రజాపాలన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సర్పంచ్ లచ్చినర్సుకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు వచ్చిన సుమారు వంద మంది అనుచరులకు కూడా ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సర్పంచ్ లచ్చినర్సు పార్టీలో చేరడం సంతోషకరమని అన్నారు. గన్నేరువరం గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి, ఖాసీంపేట సర్పంచ్ కర్నే చంద్రయ్య, చొక్కారావుపల్లె సర్పంచ్ అరికాంతం గోపాల్ రెడ్డి, గన్నేరువరం ఉపసర్పంచ్ రామంచ స్వామి, ఖాసీంపేట ఉపసర్పంచ్ సందవేని ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు ఉపేందర్ రెడ్డి, డీసీసీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
అలాగే బుర్ర తిరుపతి గౌడ్, దొగ్గల ప్రదీప్, ముస్కు కరుణాకర్ రెడ్డి, పుల్లెల నరేందర్, వెదిరే విజేందర్, పురుషోత్తం శ్రీనివాస్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.








