కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఉనికిని కాపుడుకోవడానీకె డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పై నిరాధార వాఖ్యలు చేస్తున్నారని, ఆయన
బేషరతుగా క్షమాపణలు చెప్పాలనీ కాంగ్రెస్ పార్టి జిల్లా అధికార ప్రతినిధి ముల్కల మల్లేశం డిమాండ్ చేశారు. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడి కొట్ల రూపాయల ఆస్తులను కూడగట్టుకున్న ఆయన్ని ప్రజలు ఓడగొట్టడంతో మతి భ్రమించి ,మచ్చ లేని మా నాయకుడి పై అవాక్కులు, చవాక్కులు పాల్పడటం అయన అవివెకనికి నిదర్శనం ఆని దుయ్యబట్టారు.ఇకనైనా బుద్ది తెచ్చుకొని,కవ్వంపల్లి సత్యనారాయణ కి క్షమాపణ చెప్పాలని,లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగల సత్యనారయణ రెడ్డి, ఎర్రల రాజయ్య,బొల్లి శంకరయ్య్,చాడ సతీశ్ రెడ్డి,కాల్వ పెద్ద కొమురయ్య, హన్మండ్ల శ్రీనివాస్ రెడ్డి,కల్లూరి రాము,రెవోజు కృష్ణమాచారి, బొల్లి నారయణ న్యాలపట్ల కనుకయ్య,రమేశ్ తదితరులు పాల్గొన్నారు.