contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

26న సాగర్ నీటి విడుదల .. మాచర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

మాచర్ల : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి త్రాగునీటి అవసరాల కోసం నవంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నీటిని విడుదల చేయనున్నట్లు ఎన్‌ఎస్‌పీ (NSP) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మాచర్ల మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కాలువలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా పశువులను కాలువలోకి తీసుకెళ్లకూడదని, చిన్నారులను ఈత కోసం కాలువ వద్దకు పంపవద్దని విజ్ఞప్తి చేశారు.

అలాగే రైతులు కాలువలో మోటార్లు ఏర్పాటు చేసి పైపుల ద్వారా పంట పొలాలకు నీటిని మళ్లించరాదని స్పష్టం చేశారు. కాలువ పరిసరాల్లో ఇతర పనుల నిమిత్తం కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా ప్రతి గ్రామంలో దండోరా వేయించి ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలను పాటించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :