contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శెట్టిబలిజపేటలో భక్తిశ్రద్ధలతో 31వ త్రినాథ వ్రతమేళా

కాకినాడ : హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన శ్రీ త్రినాథ వ్రతమేళా స్థానిక శెట్టిబలిజపేటలోని ఎల్విన్‌పేట శెట్టిబలిజ వీధిలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సరగడ రాంబాబు–లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన 31వ త్రినాథ వ్రత వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై త్రిమూర్తులను భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.

ఈ సందర్భంగా త్రినాథ వ్రత వేదిక కార్యనిర్వాహకులు, గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ఆదివారం రాత్రి తొలి జాములో త్రిమూర్తుల అనుగ్రహం కోసం భక్తులు అత్యంత నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారని తెలిపారు. మూడు మట్టి దీపాలు, ఆకులు, వక్కలతో మంత్రం, యంత్రం, తంత్రం లేకుండానే ప్రతి ఒక్కరూ స్వయంగా నిర్వహించగలిగే ఈ సనాతన వ్రతానికి విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నారు.

వ్రత మహత్యాన్ని వివరిస్తూ కథను చెప్పే సమయంలో భక్తులు ప్రశాంతంగా, ఏకాగ్రతతో వినాలని, మధ్యలో లేచి వెళ్లకుండా నియమ నిష్ఠలు పాటించాలని సూచించారు. హారతి అనంతరం చలిమిడి, వడపప్పు, తాంబూలం, కొబ్బరి ముక్కలను ప్రసాదంగా పంపిణీ చేయడం వ్రతంలో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు.

వ్రతాన్ని ఆచరించే వారు, కార్యక్రమంలో పాల్గొనే భక్తులు శాకాహారం మాత్రమే తీసుకోవాలని, మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ధూపం కోసం ఎండు గంజాయి ఆకులు ఉపయోగించకూడదని, సాంబ్రాణి ధూపంతోనే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు, మాఘమాసం మొత్తం 30 రోజుల పాటు సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభు భోగి గణపతి పీఠంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ త్రిదేవి త్రినాథ వ్రత మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దూసర్లపూడి రమణరాజు ప్రకటించారు. ఈ మహోత్సవాల్లో నాలుగు ఆదివారాల్లో భారీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తామాడి వెంకట లక్ష్మీ–వీరభద్రం, పద్మావతి–సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, నీలిమ, షణ్ముఖప్రియ, లోహిత, అంబిక, వీరబాబు, వాసు, సందీప్, సంతోష్, జ్యోత్స్న, మౌనికతో పాటు పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :