contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

తూప్రాన్/మెదక్ : మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన చూపిన సన్మార్గం నేటి సమాజానికి సైతం మార్గదర్శకమని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పురాణాల ప్రకారం తొలినాళ్లలో రత్నాకరుడిగా జీవించిన వాల్మీకి, సప్తర్షుల బోధనలతో ఆత్మపరిశీలన చేసుకుని తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారని తెలిపారు. అనంతరం కఠోర తపస్సు చేసి మహర్షిగా ఎదిగి, ఆదికావ్యమైన రామాయణం రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పారని పేర్కొన్నారు.

మనిషి తన తప్పులను గుర్తించి సన్మార్గంలో నడవాలని సంకల్పిస్తే జీవితంలో ఎంతటి గొప్ప మార్పునైనా సాధించవచ్చని మహర్షి వాల్మీకి జీవితం నిరూపిస్తోందని ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన బోధనలను ఆదర్శంగా తీసుకుని సత్ప్రవర్తనతో జీవిస్తూ సమాజ అభ్యున్నతికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

వాల్మీకి జయంతి సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయన సేవలను స్మరించుకుని నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్, డీఎస్పీ రంగనాథ్, ఆర్‌ఐ శైలేందర్, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :