contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్యార్థులకు చెడు అలవాట్లు, సెల్ ఫోన్ వినియోగంపై అవగాహన

  • టాస్క్ ఫోర్స్ ఎస్సై మామిడాల సురేందర్, షీ టీమ్ కానిస్టేబుల్ స్వప్న ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉండి, బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని టాస్క్ ఫోర్స్ ఎస్సై, మానవ అక్రమ రవాణా కరీంనగర్ జిల్లా ఇంచార్జి మామిడాల సురేందర్ పిలుపునిచ్చారు.

గురువారం గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చెడు అలవాట్లు, సెల్ ఫోన్ వినియోగం, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్సై మామిడాల సురేందర్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం, షీ టీమ్ కానిస్టేబుల్ స్వప్న హాజరై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఎస్సై మామిడాల సురేందర్ మాట్లాడుతూ…

విద్యార్థి దశే జీవితానికి పునాది అని, ఈ దశలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ అవసరమే కానీ, దానిని అతిగా వాడటం వల్ల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు మూడు దెబ్బతింటాయని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, వారు పంపే లింకులు, మెసేజ్ లు తెరవవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలు ఎవరికీ పంపవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ముందుగా స్నేహంగా మాట్లాడి, తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారని, అలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

ఆన్ లైన్ లో ఎవరైనా డబ్బులు పంపమని, ఓటీపీ అడిగినా, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని, అది సైబర్ మోసమని గుర్తించాలని అన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

గుట్కా, పాన్ మసాలా, సిగరెట్, మద్యం వంటి చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, ఒక్కసారి అలవాటు పడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అన్నారు. స్నేహితుల ఒత్తిడికి లోనై చెడు అలవాట్లకు బానిసలు కావద్దని, మంచి స్నేహితులను ఎంచుకోవాలని సూచించారు.

మానవ అక్రమ రవాణా ముఠాలు పేద విద్యార్థులను, బాలికలను ఉద్యోగాలు, పెళ్లి పేరుతో మోసం చేసి తీసుకెళ్తుంటారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీసులకు తెలియజేయాలని చెప్పారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 ఏళ్ల లోపు బాలికలకు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని, బాల్య వివాహాల వల్ల చదువు ఆగిపోయి, ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు.

విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని చదవాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, వారి కలలను నెరవేర్చేలా కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య వస్తే భయపడకుండా 100, 112, 1098 చైల్డ్ లైన్, 1930 సైబర్ క్రైమ్ నంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.

కానిస్టేబుల్ స్వప్న మాట్లాడుతూ…

బాలికలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని షీ టీమ్ కానిస్టేబుల్ స్వప్న సూచించారు. సెల్ ఫోన్ లో సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని, తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయవద్దని చెప్పారు.

ఆడపిల్లలు ఎవరైనా వేధిస్తే, వెంటాడితే, అసభ్యంగా మాట్లాడితే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని, వెంటనే తల్లిదండ్రులకు, టీచర్లకు, షీ టీమ్ కు తెలియజేయాలని అన్నారు. షీ టీమ్ ఎప్పుడూ బాలికల రక్షణ కోసమే ఉంటుందని భరోసా ఇచ్చారు.

సెల్ ఫోన్ ను చదువు కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం పాజిటివ్ గా వాడుకోవాలని, గేమ్స్, రీల్స్, చాటింగ్ కు గంటల తరబడి సమయం వృధా చేయవద్దని సూచించారు. రాత్రి ఆలస్యం వరకు ఫోన్ చూడటం వల్ల కళ్లు దెబ్బతిని, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వస్తుందని వివరించారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి కె. రామయ్య, సర్పంచ్ రంగనవేని లచ్చినర్సు,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, చాకలివానిపల్లె గ్రామ ఉపసర్పంచ్ కూన సంతోష్, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్కూరి అనంతరెడ్డి, మాజీ విద్య కమిటీ చైర్మన్ బుర్ర మల్లేశం గౌడ్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు సందవేణి ప్రశాంత్ యాదవ్, షీ టీం కానిస్టేబుల్ మల్లేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :