contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

టికెట్ జారీ విధానం తెలియదా..? లేక నిర్లక్ష్యమా..? .. మాచర్ల ఆర్టీసీ బస్సులో ఘటన

మాచర్ల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాల అమలులో కొందరు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాల అమలులో లోపాలు ఉంటున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా గుంటూరు–మాచర్ల మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులో ఓ కండక్టర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల ప్రకారం.. AP 39 TJ 5454 నంబర్ గల బస్సు గుంటూరు నుంచి మాచర్లకు వెళ్తుండగా, 13-11-2026 ఉదయం 5:10 గంటల సమయంలో ప్రయాణించిన ఓ జర్నలిస్టు తనకు జర్నలిస్ట్ పాస్ ఉందని కండక్టర్‌కు తెలిపినట్లు పేర్కొన్నారు.

అయితే సంబంధిత కండక్టర్ తనకు జర్నలిస్ట్ పాస్ ఉన్నప్పటికీ దివ్యాంగ శక్తి పథకం కింద టికెట్ జారీ చేశారని, దీనిపై ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఉచిత ప్రయాణ పథకాల అమలు విధానం, టికెట్ల జారీపై సిబ్బందికి సరైన అవగాహన ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారులు తగిన విధంగా తనిఖీలు చేస్తున్నారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల డిపో పరిధిలో బస్సుల్లో జరుగుతున్న పరిణామాలపై అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీ శక్తి పథకాన్ని కొందరు సిబ్బంది నిర్లక్ష్యం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాల్సిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.

ఈ ఘటనపై మాచర్ల డిపో మేనేజర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఆరోపణలపై ఆర్టీసీ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :