పల్నాడు జిల్లా – గురజాల: గురజాల నియోజకవర్గంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మున్సిపల్ చైర్మన్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ఈ సందర్భంగా పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన షేక్ బాబావలి, దాచేపల్లి మున్సిపల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తంగెళ్ల శ్రీనివాసరావు, గురజాల మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నేలవల్లి బొలయ్యలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ, ప్రజలు అప్పగించిన పదవులు గౌరవప్రదమైన బాధ్యతలని, వాటిని ప్రజాసేవకు అంకితం చేయాలని సూచించారు. చైర్మన్లు తమ తమ పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
అదేవిధంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చైర్మన్లు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన చైర్మన్ల నాయకత్వంలో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల పట్టణాలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని యాగంటి మల్లికార్జునరావు ఆకాంక్షించారు.








