contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నూతన చైర్‌పర్సన్‌కు టీడీపీ సీనియర్ నేత అభినందనలు

మాచర్ల: మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి ఎనముల సుష్మా కేశవరెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా సుష్మా కేశవరెడ్డి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, మాచర్ల పట్టణ సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు.

ప్రజా సేవే పరమావధిగా, పట్టణాభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగించి, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు వంటి ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అభిలషించారు.

ఎనముల సుష్మా కేశవరెడ్డి నాయకత్వంలో మాచర్ల పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదర్శ మున్సిపాలిటీగా నిలవాలని కోరుతూ యాగంటి మల్లికార్జునరావు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :