contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

21వ డివిజన్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్‌లైన్ నమోదు

గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 21వ డివిజన్‌లో బుధవారం కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మార్గదర్శకత్వంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 21వ డివిజన్‌లోని ప్రతి అర్హ కుటుంబం ఈ పథకం ప్రయోజనాలు పొందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, ప్రజలు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ కోరారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధికారి కృష్ణ, అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్‌పీలు సరోజన, రజిత, డివిజన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు పథకానికి సంబంధించిన నమోదు విధానం, అవసరమైన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :