జగిత్యాల జిల్లా, కోరుట్ల లో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోరుట్ల పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలో మంగళవారం అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా నావులపేటకు చెందిన చౌలమద్ది లక్ష్మీరాజంకు చెందిన ట్రాక్టర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన కోరుట్ల పోలీసులు తనిఖీలు నిర్వహించి ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడం, అక్రమ రవాణాకు పాల్పడటం చట్టరీత్యా నేరమని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల పోలీసులు హెచ్చరించారు.








