పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ : ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతుంటే అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం మాత్రం నిరవేరడం లేదు. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో NHM మరియు APHSSP నిధులతో అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ ని నిర్మించారు. హెల్త్ సెంటర్ ని అక్టోబర్ 28 న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రారంభించి రెండు నెలలు కూడా కాలేదు గోడలు పగిలిపోతున్నాయి. వాటి నిర్మాణం సమయంలో వాటి నాణ్యతా ప్రమాణాలను సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో నాసిరకంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలు విన వస్తున్నాయి. 90 లక్షల రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ నాసిరకం పనుల వలన గోడలు పగిలిపోతున్నాయి, బాత్రూంలు సరిగా లేవు , పై కప్పు కూలిపోయే ప్రమాదముంది. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.