contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విఠల్ నగర్‌లో నిర్మాణం పూర్తికాక నిరుపయోగంగా ఉన్న మార్కెట్ యార్డ్‌పై రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన ప్రత్యేక కథనానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన మార్కెట్ యార్డ్‌ను స్వయంగా సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

విఠల్ నగర్ ఈ-సేవ కేంద్రం సమీపంలో స్థానిక ప్రజలకు, చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా సుమారు రూ.8 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి అప్పటి రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ శ్రీకారం చుట్టారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమై చాలా కాలం గడిచినా మార్కెట్ యార్డ్ పూర్తికాకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.

ప్రజాధనంతో నిర్మిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రజలకు ఉపయోగపడాల్సి ఉండగా, పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను రిపోర్టర్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో ఎమ్మెల్యే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు నిరుపయోగంగా ఉండకూడదని, వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యే వెంట రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ ముస్తఫా, కార్పొరేటర్లు చుక్కల శ్రీను, దూళికట్ట సతీష్, నెలకంటి రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా రిపోర్టర్ టీవీ  కథనంపై ప్రజాప్రతినిధి స్పందించడం, సమస్య పరిష్కారం దిశగా అడుగు పడటానికి దోహదపడింది.

మార్కెట్ యార్డ్ అని మొదలుపెట్టి .. మధ్యలోనే వదిలేశారా?

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :