- 5 ఇంక్లైన్ విఠల్ నగర్ మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
- ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడుతున్న యువకులకు కౌన్సెలింగ్
గోదావరిఖని : మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని గోదావరిఖని వన్టౌన్ పోలీసులు హెచ్చరించారు. నగరంలోని 5 ఇంక్లైన్ నుంచి విఠల్ నగర్ క్లబ్కు వెళ్లే మార్గమధ్యంలోని పార్కు మూలమలుపు వద్ద వన్టౌన్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనాలు నడుపుతున్నపుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని వాహనాలు వేగంగా, నిర్లక్ష్యంగా ప్రయాణిస్తున్న యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
రహదారులపై ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారుల తో పాటు ఇతర వాహనదారులకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని సూచించారు. యువత రహదారి భద్రతా నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించారు.మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు దారితీయడమే కాకుండా చట్టపరమైన ఇబ్బందులకు కారణమవుతుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.








