contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

 పల్నాడు జిల్లా – మాచర్ల  : తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలిచే లక్ష్యంతో మాచర్ల పట్టణంలోని ఎస్వీఆర్ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఎస్వీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు పట్టణానికి చెందిన ప్రజలు ఉత్సాహంగా పాల్గొని సుమారు 100 మంది రక్తదానం చేశారు.

తలసేమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు నిర్వహించిన ఈ సేవా కార్యక్రమానికి విద్యార్థులు విశేష స్పందన చూపారు. సమాజ శ్రేయస్సుకు దోహదపడే కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ఎస్వీఆర్, కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు ముందుండడం అభినందనీయమని పట్టణ ప్రజలు ప్రశంసించారు.

ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్ యనుముల సుష్మారెడ్డి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు యనుముల కేశవరెడ్డి రక్తదాతలను అభినందిస్తూ, ఇలాంటి మానవతా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ వెంకట్రామయ్య, డైరెక్టర్లు, అధ్యాపకులు, బోధన సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :