contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం: యాగంటి

పల్నాడు జిల్లా – మాచర్ల : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాలు ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు అన్నారు. ప్రజలు తమ తీర్పు ద్వారా వైసీపీకి తగిన సమాధానం చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

మాచర్ల పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యాగంటి మల్లికార్జున రావు మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు విజయాలు సాధించడంతో ఆ ఆరోపణలకు సమాధానం లభించిందని అన్నారు. గతంలో కూటమికి 15 శాతం మెజారిటీ ఓటింగ్ ఉంటే, ప్రస్తుతం అది 25 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకునేందుకు వైసీపీ కోర్టులను ఆశ్రయించిందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ నాటికి ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.14 వేల కోట్ల నిధులు అందుతాయని, ఆ నిధులు గ్రామాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఉపయోగపడతాయని తెలిసినా ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. అయితే కోర్టులో వారి పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజాసేవే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత

ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు యాగంటి మల్లికార్జున రావు ప్రత్యేక సూచనలు చేశారు. పదవులు అలంకారం కోసం కాదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అవకాశాలని అన్నారు. కక్షలు, రాజకీయ విభేదాలకు తావులేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని సూచించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, యువతకు ఉపాధి అవకాశాలు వంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఈ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని, అందుకే కూటమి పట్ల ప్రజల్లో ఆదరణ కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువస్తున్నారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

చివరిగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులకు యాగంటి మల్లికార్జున రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :