contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మాచర్లలో ధరణి రైస్ కేంద్రం ప్రారంభం

పల్నాడు జిల్లా – మాచర్ల : ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైస్ కేంద్రాన్ని పల్నాడు జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.వి. ప్రసాద్ మాచర్ల పట్టణంలో ప్రారంభించారు.

మాచర్ల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, బియ్యం విక్రయాలను పరిశీలించారు.

ఈ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలకు విక్రయించనున్నారు. ఇందులో భాగంగా కేఎన్ఎం రకం బియ్యాన్ని కిలో రూ.50కు, బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.49కు విక్రయిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి 26 కిలోల బియ్యం బ్యాగును అందుబాటులో ఉంచారు.

అదేవిధంగా ఇతర రకాల బియ్యానికి కూడా ధరలను నిర్ణయించారు. బీపీటీ (సోనా, సాంబా), కేఎన్ఎం రకం బియ్యం కిలో రూ.66కు, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకం బియ్యం కిలో రూ.76కు, జై శ్రీరామ్ రకం బియ్యం కిలో రూ.82కు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.వి. ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలు ధరణి రైస్ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని సూచించారు. నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయించే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ (CSDT) ఎస్.కె. బాషా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :