contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరీంనగర్‌ను డ్రగ్ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దుతాం: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కేసులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఈగిల్ టీమ్) ఎస్పీ గిరిధర్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (ఐపీఎస్) ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న ఎన్‌డిపిఎస్ కేసుల పురోగతి, దర్యాప్తు పరిస్థితి, కేసుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ గిరిధర్ కేసుల వివరాలను పరిశీలించి, దర్యాప్తు ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ప్రధాన పెడ్లర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని, వారి సరఫరా వ్యవస్థను పూర్తిగా ఛేదించాలని ఆదేశించారు.

ఎన్‌డిపిఎస్ చట్టాలపై దర్యాప్తు అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సరైన ఆధారాలతో పకడ్బందీగా ఛార్జిషీట్లు దాఖలు చేయాలని సూచించారు. నిందితులకు సులభంగా బెయిల్ లభించకుండా చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని, కోర్టుల్లో నేర నిరూపణ జరిగేలా దర్యాప్తు నాణ్యతను పెంచాలని తెలిపారు.

మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత, విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కళాశాలలు, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అలాగే కమిషనరేట్ పరిధిలోని డీ-అడిక్షన్ కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా గంజాయి వినియోగదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. కరీంనగర్ కమిషనరేట్‌ను డ్రగ్ ఫ్రీ కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో కమిషనరేట్ ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, ఈగిల్ ఏసీపీలు ఉపేందర్, సోమనాథ్, పుష్పన్ కుమార్, సీఐలు, ఎస్సైలు, దర్యాప్తు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :